BJP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వారి పార్టీలను బలోపేతం చేసుకోవడం కోసం మూడు పార్టీలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బిజెపి సైతం ఏపీలో కొత్త ఆశలను పెట్టుకుందని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఏపీలో విజయం సాధించడం కోసం ఎంతో కష్టపడుతున్న బిజెపి ఈసారి మాత్రం పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించింది.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సహాయంతో ఏపీలో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి ఎంతో కృషి చేస్తుంది. ఇప్పటికే పవన్ నుంచి మోదీ నాయకత్వానికి పూర్తి మద్దతు ఉంది. దీంతో, చిరంజీవి తమతో భవిష్యత్ రాజకీయంగా కలిసి వచ్చేందుకు భారీ స్కెచ్ అమలు చేస్తోంది. ఢిల్లీ కేంద్రంగా సాగిన తాజా మంత్రాంగంలో చిరంజీవికి భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ అవకాశానికి పవన్ కళ్యాణ్ సైతం సై అన్నట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో సక్సెస్ అయిన తర్వాత తన అన్నయ్యలను కూడా ఉన్నత పదవులలో కూర్చోబెడుతున్నారు. ఇప్పటికే నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో చోటు దక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవికి సైతం కేంద్రంలో చోటు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ చిరంజీవికి మోడీ పెద్ద పీట వేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకలలో భాగంగా చిరంజీవితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు.అక్కడ ప్రధాని – మెగా కాంబినేషన్ పైన ఏపీ భవిష్యత్ రాజకీయాల పైన చర్చ మొదలైంది. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు తరువాత కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చిరంజీవి, రామ్ చరణ్ లతో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక త్వరలోనే మోడీ తన భవిష్యత్ రాజకీయాల కోసం చిరంజీవిని సాదరంగా తన పార్టీలోకి ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇటీవల జరిగినటువంటి సమావేశాలలో భాగంగా చిరంజీవికి కేంద్రంలో మంత్రిగా బాధ్యతలను అప్పగించబోతున్నట్టు సమాచారం. ఇక తన అన్నయ్యకు కేంద్ర మంత్రిగా పదవి ఇవ్వాలని నిర్ణయానికి పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే కేంద్రమంత్రిగా పనిచేసిన చిరు మరోసారి కేంద్ర మంత్రి కాబోతున్నారంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చలకు కారణమైంది. త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం.