ఏపీ సర్కార్ కి అక్షింతలు వేసిన ఏపీ హైకోర్టు, ఇది మిస్ అవ్వకూడని సీన్ గురూ

ap high court serious on ap police

ఏపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేయడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. చాలాసార్లు హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. తాగా కడప జిల్లా పులివెందుల కేసులో కూడా ప్రభుత్వంపై కోర్టు సీరియస్ అయింది. పులివెందులలో దళిత మహిళపై అత్యాచారం కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది.

ap high court serious on ap police
ap high court serious on ap police

దళిత మహిళపై అత్యాచారాన్ని ఖండిస్తూ… టీడీపీ పార్టీ పులివెందులలో ఆందోళన చేసింది. ఆ మహిళకు మద్దతుగా చలో పులివెందుల కార్యక్రమాన్ని నిర్వహించింది. బాధిత మహిళకు అండగా ఉన్న టీడీపీకి చెందిన కొందరు నేతలపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. వాళ్లలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఉన్నారు. ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అని కూడా తెలియకుండా ఆమెపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేయడంతో.. ఆమె వెంటనే కోర్టుకు వెళ్లారు.

హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో… దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. పోలీసులపై సీరియస్ అయింది. బాధిత మహిళకు అండగా నిలబడితే కూడా కేసులు నమోదు చేస్తారా? అంటూ పోలీసులను ప్రశ్నించింది. ఒక ఎస్సీ మహిళపై.. ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేస్తారా? అంటూ కోర్టు మొట్టికాయలు వేసింది.

చట్టాలకు లోబడి పోలీసులు పనిచేయాలని.. చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోకూడదంటూ.. కోర్టు పోలీసులను వెల్లడించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో పాటు.. పోలీసులను, డీజీపీని హైకోర్టు చాలాసార్లు హెచ్చరించింది. అయినా కూడా అదే రిపీట్ చేస్తుండటంతో.. ఈ పిటిషన్ పై హైకోర్టు చాలా సీరియస్ అయింది.