Tollywood Big Movies : నిన్న ఒక రోజులో టాలీవుడ్ సినిమా దగ్గర ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా వాయిదా తో సంక్రాంతి బరిలో ఉన్న రెండు భారీ సినిమాలకు పెద్ద ఊరటనే ఇచ్చింది. మరి ఆ రెండు సినిమాలు కూడా ఏవో అందరికీ తెలుసు. మరి మరోపక్క టాలీవుడ్ కి మరియు ఏపీ ప్రభుత్వం కి కొన్నాళ్ళ నుంచి తీరని రచ్చ కంటిన్యూ అవుతూ వస్తుంది.
ఇక ఇప్పుడు ఈ సమస్యకి ఒక సమాధానం అయితే ట్రిపుల్ ఆర్(RRR) మరియు రాధే శ్యామ్ లకి దొరుకుతాయట. ఈ రెండు సినిమాలకి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వారు ఒక వారం పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఇన్సైడ్ టాక్. మరి కారణం ఏమో కాని ప్రస్తుతం అయితే ఈ రెండు సినిమాలకు ఏ డోకా లేదు అని తెలుస్తుంది. అయితే ఇది ఈ రెండు సినిమాలకేనా లేక మిగతా వాటికి కూడా ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది.