AP Government: కరోనా మార్గదర్శకాలని జారీ చేసిన ప్రభత్వం

AP Government: కరోనా విజృంభిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గ దర్శకాలని జారీ చేసింది. నిబంధనల్ని కఠినంగా అమలు చెయ్యాలని ఎస్పీలను, కలెక్టర్లను ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వాళ్లకి రూ. 100 ఫైన్ విధించాలని తెలిపింది. మాస్క్ లేకుండా షాపులకి రానిస్తే.. యాజమాన్యానికి రూ. 10,000 నుంచి రూ. 25 వేళా వరకు జరిమానా వేయాలని తెలిపింది. ఉల్లంఘన జరిగితే 2 రోజులు వ్యాపార సంస్థలు మూసివేయాలని.. ఉల్లంఘనలపై 8010968295 నెంబరుకు ఫిర్యాదు చెయ్యాలని సూచించింది.

చలి కాలం వచ్చినప్పుడు ఇటువంటి ఆంక్షలు పెట్టకపోతే ప్రజలు మాస్కులు ధరించకుండా బీభత్సంగా తిరుగుతారని ప్రభుత్వం తగిన కట్టడి చర్యలు చేపడుతుంది. చాలా మంది ప్రజలు మాస్క్ లని సైతం లెక్క చెయ్యకుండా తిరుగుతున్నారు. మరి ప్రభుత్వం జారీ చేసిన నియమాలని ప్రజలు పాటిస్తారా.. పోలీసులు పాటించేటట్లు చేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.