Akkineni Nagarjuna: అందరు ఒక వైపు అయితే.. టికెట్ల విషయంపై నాగార్జున మరో వైపు..!

Akkineni Nagarjuna: ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సినిమా టికెట్ల వ్యవహారం నడుస్తోంది. ఎక్కడ చూసినా వీటిపైనే చర్చ కొనసాగుతోంది. ఇలా ప్రతీ ఒక్క సినిమా నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ వ్యవహారం పై పోరాటం చేస్తున్నారు. ఈ సమస్యపై మొదట పవన్ కళ్యాన్ మాట్లాడిన విషయం తెలిసిందే. అప్పట్లోనే అందరూ కలిసి అతడికి సపోర్టు చేసి ఉంటే.. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు కదా అంటూ చర్చించకుంటున్నారు. తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వంపై మండిపోయాడు.

ఇలాంటి ఆలోచనను మానుకోవాలని.. సినిమా థియేటర్ల కంటే.. కిరాణ కొట్టు నడిపే వాడిక ిఎక్కువగా ఆదాయం వస్తుందని చెప్పాడు. దీంతో నానీపై ఒక్కసారిగా అధికార పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. ఇలా మొత్తం టాలీవుడ్ టికెట్ ధరల సమస్యపై పోరాడుతున్న తరుణంలో నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేసి పలువురిని షాక్ కు గురిచేసింది.బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న టిక్కెట్ ధరలు తన సినిమాకు సరిపోతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న టిక్కెట్ల ధరల సమస్య , తన సినిమాపై దాని ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. “సినిమాకు సంబంధించిన వేదికపై రాజకీయాల గురించి మాట్లాడటం సరైన పని కాదు.

అయితే, టిక్కెట్ల విషయానికొస్తే.. ఏపీలో ఇప్పుడున్న టిక్కెట్ల ధర నా సినిమాకు సరిపోతుంది’’ అని అన్నారాయన. నాగార్జున చేసిన ఈ ప్రకటన సెల్ఫ్ సెంటర్‌గా ఉందంటూ పలు విమర్శలు ఎదుర్కొంటోంది.పరిశ్రమ మొత్తం సమస్యను ఎదుర్కొంటున్న తరుణంలో సొంత ప్రయోజనాల కోసం కాకుండా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు. బంగార్రాజు సినిమా విషయానికి వస్తే.. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2016 సోషియో ఫాంటసీ సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో నాగార్జునతో నాగ చైతన్య జతకట్టనున్నారు.