AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వైసీపీ నేతలను అలాగే వైసీపీకు సపోర్ట్ చేసిన వారందరినీ కూడా అరెస్టులు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వరుస అరెస్టులతో జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం పక్కా పథకంతోనే అరెస్టులను చేస్తున్నారని 2029 లోగా జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయి జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందేనని కూటమి నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇలా 2029 ఎన్నికల నాటికి తమకు పోటీ లేకుండా కూటమి ప్రణాళికలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. జగన్అరెస్ట్ అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతుంది. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలకు అరెస్టు చేస్తూ వైసీపీకి అందరినీ దూరం చేస్తూ వస్తున్నారు. ఇలా వైసిపికి పలువురు నేతలు రాజీనామా చేయడం మరి కొంతమంది ఇతర పార్టీలలోకి చేరడం జరుగుతుంది. ఇలా చేయడం జగన్మోహన్ రెడ్డిని కూటమి పార్టీలు బలహీన పరుస్తున్నట్లేనని చెప్పాలి.
జగన్మోహన్ రెడ్డి సైతం తిరిగి యాక్టివ్ అవుతూ 2029 నాటికి తన పార్టీని మరింత బలపరచుకొని ప్రజలు మెచ్చే విధంగా అడుగులు వేస్తూ ఉంటే ఆయనకు ఏ విధమైనటువంటి డోకా ఉండదు కానీ ఇప్పటిలాగే కొనసాగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పనిసరి పరిస్థితులలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి తన పార్టీని తిరిగి బలపరచుకోవడానికి ఆయన వద్ద చాలా సమయం ఉంది. జగన్ 2029లో అధికారంలోకి రావడం కోసం ఎలాంటి పథకాలను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది. జగన్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. ఏపీలో వైఎస్ జగన్ కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉంది. జగన్ కు కార్యకర్తల సపోర్ట్ కూడా ఎంతో అవసరం అనే సంగతి తెలిసిందే.
2029 ఎన్నికలలో సక్సెస్ అవ్వాలి అంటే 2024 ఎన్నికల సమయంలో చేసిన తప్పులను జగన్మోహన్ రెడ్డి చేయకుండా ఉండటం ఎంతో అవసరం. జరగబోయే ప్రతి ఎన్నికలు కూడా వైసీపీకి ఎంతో కీలకంగా మారాయి. మరి 2029 నాటికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి తన పార్టీని ఎలా తిరిగి నిలబెట్టుకోగలుగుతారు అనేది తెలియాల్సి ఉంది.