ఏ పార్టీ అయినా సరే.. అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పదవులు ఇవ్వలేదనో… ఇంకేదో కారణంతో పార్టీలో విభేదాలు వస్తుంటాయి. ఆధిపత్య పోరు కూడా ఎక్కువైందంటే.. ఆ పార్టీకి పగ్గాలు ఉండవు. దాని వల్ల పార్టీ పరువు గంగలో కలుస్తుంది. పార్టీ ప్రతిష్ఠ మసకబారుతుంది.
ప్రస్తుతం ఏపీలోని వైసీపీ పార్టీలోనూ అదే సమస్య వెంటాడుతోంది. వైసీపీలో ఆధిపత్య పోరు పెరిగింది. దీని వల్ల సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు విమర్శించుకుంటున్నారు.
ఇటీవల కాకినాడలో జరిగిన డీఆర్సీ మీటింగ్ లో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి మధ్య మాటా మాటా పెరిగింది. మాటల యుద్ధమే జరిగింది. పిల్లి సుభాష్ చంద్రబోస్… టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. అయితే.. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ విషయంలో ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలంటూ పిల్లికి సవాల్ విసిరారు. ఇంకా చాలా పెద్ద గొడవే జరిగింది ఇద్దరి మధ్య.
ఈ వ్యవహారం చివరకు ఏపీ సీఎం జగన్ వద్దకు చేరింది. వాళ్లు ప్రవర్తించిన తీరుపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వెంటనే తనను కలవాలంటూ కబురు పంపారు. ఇద్దరికీ సీఎం జగన్ ఫుల్లుగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇలా పార్టీకి సమస్యలు తెచ్చిపెట్టకుండా.. కొంచెం హద్దుల్లో ఉండాలని.. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులు ఇలా ప్రవర్తిస్తే.. అది పార్టీకే కాదు.. ప్రజల్లో చులకన అవడంతో పాటు.. ప్రతిపక్ష పార్టీల నేతలకు కూడా తాము అలుసు అయిపోతామని గట్టిగానే వాళ్లకు వార్నింగ్ ఇచ్చారట. అది మ్యటర్..