ప్రతి అడుగులో రైతన్నకు అండగా ఉంటామన్న సీఎం జగన్..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్ తాజాగా చుట్టగుంటలో యంత్ర సేవా పథకం ప్రారంభంలో పాల్గొన్నారు. ఈ పథకంలో మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమంను ప్రారంభించారు. ఇక అక్కడ మీడియా సమావేశంలో కొన్ని విషయాలు మాట్లాడారు జగన్.

ఈరోజు గొప్ప కార్యక్రమం జరుగుతుంది అని.. ప్రతి అడుగులో రైతన్నకు అండగా ఉంటున్నామని అన్నారు. ప్రతి గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు తోడుగా ఉండేలా ఏర్పాటు చేశామని అన్నారు. ట్రాక్టర్ లతో సహా వస్తువులను అందుబాటులో ఉంచామని అన్నారు. ఆర్ బి కే స్థాయి యంత్ర సేవ కేంద్రాలకు 3,800 ట్రాక్టర్ల పంపిణీ చేస్తున్నామని అన్నారు.