‎Ghaati: అనుష్క శెట్టి ఘాటీ మూవీ ట్రైల‌ర్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో!

‎‎Ghaati: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు పనిలేదు. ఈమె భాగమతి, అరుంధతి, బాహుబలి లాంటి ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాల కంటే ముందు చాలా సినిమాలలో నటించినప్పటికీ ఈ సినిమాలు మాత్రం అనుష్క శెట్టికి భారీగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రధాన పాత్రలతో పాటుగా గ్లామరస్ పాత్రలు కూడా పోషించారు అనుష్క. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కాగా అనుష్కలోని నట విశ్వరూపాన్ని తెరపై ఆవిష్కరించిన తొలి సినిమా మాత్రం మాత్రం అరుంధతి అని చెప్పాలి.

‎ అయితే బాహుబలి 2 సినిమా తరువాత అనుష్క సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేసింది. ఇకపోతే అనుష్క ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే.. ఈమె ప్రస్తుతం ఘాటీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వేదం సినిమా తరువాత అనుష్క అలాగే క్రిష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన  అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

GHAATI Trailer (Telugu) | Anushka Shetty | Vikram Prabhu | Krish Jagarlamudi | UV Creations

‎ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు సర్‌. బ్రిటిష్‌ కాలంలో కొండలు బద్దలు కొట్టి రక్తంతో రోడ్లు వేసేవాళ్లు. ఇప్పుడు గంజాయి మోసే కంచర గాడిదలు అంటూ ఒక వ్యక్తి చెప్పే వాయిస్‌ ఓవర్‌ తో ట్రైలర్‌ మొదలవుతుందీ. ఆంధ్రా,ఒడిశా సరిహద్దుల్లో జరిగే కథ ఇది. అనుష్క, విక్రమ్‌ ప్రభు గంజాయి స్మగ్లింగ్‌ చేసే ఘాటీలుగా కనిపించారు. వాళ్లు తాము. చేస్తున్న పని తప్పని తెలుసుకుని ఆ నేర వృత్తి నుంచి బయటకొచ్చి గంజాయి ముఠాను నడిపించే వ్యవస్థపై తిరుగుబాటుకు సిద్ధపడినప్పుడు ఏం జరిగింది? వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి? అన్నది ప్రచార చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు. సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో సూద్దురుగాని అంటూ ట్రైలర్‌ ఆఖర్లో వినిపించిన డైలాగ్‌ ఆకర్షణగా నిలిచింది.