విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్ స్పందించిన అనుష్క.. పూరి మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నా?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా లైగర్. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినది. ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా నుంచి చిత్ర బృందం విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్ విడుదల చేశారు.

ఒంటి పై ఎలాంటి బట్టలు లేకుండా, చేతిలో గులాబీ పువ్వులు పట్టుకొని ఉన్నటువంటి ఈ ఫోటోని విడుదల చేశారు. ఈ ఫోటోను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ సినిమాలో ఈ పాత్ర కోసం మానసికంగా శారీరకంగా నా సర్వస్వం ధారపోసాను ఈ పాత్ర నా కెరియర్ లో ఛాలెంజింగ్ రోల్ అంటూ విజయ్ దేవరకొండ ఈ ఫోటో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇకపోతే లైగర్ చిత్రం నుంచి విడుదలైన ఈ అప్డేట్, విజయ్ బోల్డ్ లుక్ పై స్వీటీ స్పందించారు.

ఈ సందర్భంగా అనుష్క శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ….లైగర్‌ చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ ఈ సినిమా అందరి హృదయాలను దోచుకోవాలని కోరుకుంటున్నాను. పూరి సార్ మీ మ్యాజిక్ స్క్రీన్ పై చూడటం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. విజయ్ ఈ సినిమా నీకు బెస్ట్ సినిమా కావాలి.ఎన్నో విభిన్నమైన కథలు మాకందిస్తున్న ఛార్మి, ఆ కథలు తెరకెక్కించడంలో భాగమైన కరణ్‌జోహార్‌కు ధన్యవాదాలు అని అనుష్క ఈ సినిమా అప్డేట్ పై స్పందిస్తూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.