Anupama Parameshwaran: బేబీ బంప్ ఫోటోలతో అనుపమ..ఫోటోలు వైరల్!

Anupama Parameshwaran: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా పలు చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈమె తెలుగులో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న అనుపమ అదే స్థాయిలో నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొన్నారు. అందుకు గల కారణం ఈమె ఇందులో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడమే. ఇలా ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో అనుపమతో పాటు తన తండ్రి పరమేశ్వరన్ కూడా ఉన్నారు. ఈ ఫోటోని షేర్ చేసిన అనుపమ అదొక బ్యూటీఫుల్ ఫొటో అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫోటో విషయానికి వస్తే ఈమె 2020 సంవత్సరంలో నటించిన మనియారాయిలే అశోకన్ అనే మలయాళం సినిమాలో ఇలా ప్రెగ్నెంట్ గా కనిపించింది.
కరోనా కారణం వల్ల ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోని షేర్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.
.