బంపర్ ఆఫర్ కొట్టేసిన అనుపమ.. బ్లాక్ బాస్టర్ సీక్వెల్ సినిమాలో ఆఫర్?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమమ్ అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించిన అనుపమ అ ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన అనుపమ ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శతమానంభవతి సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన అనుపమ అటు మలయాళం, తమిళ భాషలలో కూడా స్టార్ హీరోల సరసన నటించింది.

హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్ మలయాళం భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల అనుపమ నటించిన కార్తికేయ2 సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 13వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అనుపమ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సినిమా సీక్వెల్లో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న డీజే టిల్లు సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరం నేహా శెట్టి స్థానంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందనీ సమాచారం. ఇప్పటికే ఈ సినిమా అగ్రిమెంట్ లో కూడా అనుపమ సంతకం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డీజే టిల్లు సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న సినిమాకి సంబందించిన
స్క్రిప్ట్, డైలాగ్స్ సిద్దు జొన్నలగడ్డ స్వయంగా రాశారని సమాచారం. ఈ సీక్వెల్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.