మంచు విష్ణు నుండి ఇంకో సర్ప్రైస్

హిట్, ప్లాప్ తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు మంచు విష్ణు. ‘ఈడోరకం ఆడోరకం’ తర్వాత ఒక్క హిట్ కూడా లేని విష్ణు తాజాగా ‘జిన్నా’ అనే మూవీ తో రెడీ అవుతున్నాడు. మొదట్లో ‘గాడ్ ఫాదర్’, ‘ఘోస్ట్’ సినిమాలకు పోటీగా దసరా కి ఈ సినిమా ని రిలీజ్ చెయ్యాలి అనుకున్నాడు, కానీ సినిమా రిలీజ్ ని వాయిదా వేశారు.

ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేసిన ఈ టీం ప్రస్తుతం ‘జిన్నా’ టైటిల్ సాంగ్ ని సెప్టెంబర్ 28, 2022 న ఉదయం 11:00 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.

సూర్య దర్శకత్వం లో వస్తున్న ఈ మూవీ లో సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ హీరోయిన్స్   అలాగే సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర కూడా ఉన్నారు. ఈ సినిమా మీద టీం మంచి కాన్ఫిడెంట్ గా ఉంది. చూస్తుంటే ఈ సారి మంచు విష్ణు ఎలాగైనా హిట్ కొట్టేలా ఉన్నాడు.