టాలీవుడ్ లో మరో స్టార్ వారసుడు ఎంట్రీ

టాలీవుడ్ లో ఇంకో స్టార్ వారసుడు ఎంట్రీ కి సిద్ధం గా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు మనవడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ త్వరలో హీరో గా ఎంటర్టైన్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు.

కొన్నాళ్ల క్రితమే వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమాతో పరిచయం అవ్వాల్సిన అభిరామ్ ఆ సినిమాని వదులుకున్నాడు. కొన్నాళ్ళు శ్రీ రెడ్డి వివాదం లో తన పేరు వచ్చింది, కానీ అభిరామ్ మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు.

ఆఖరికి తేజ దర్శకత్వంలో ‘అహింస’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు అభిరామ్. గీతికా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా కనిపించినట్లు తెలుస్తోంది. రజత్‌ బేడీ, సదా, రవి కాలే, కమల్‌ కామరాజు తదితరులు ఇందులో ఇతర పాత్రల్లో నటించారు.

ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నిర్మాత పి కిరణ్‌ నిర్మిచిన ఈ సినిమా ఒక యాక్షన్ తో కూడిన లవ్ స్టోరీ గా తెలుస్తుంది. చాలా కాలం తర్వాత ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ని సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 9 గం. 9 ని. లకు విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ ప్రకటించింది.