షాకింగ్ : ‘మా’ ఎన్నికల కౌంటింగ్ పై మరో ట్విస్ట్.!

అసలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి జరిగినటువంటి మా ఎన్నికలు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపాయి. అయితే ఈ ఎన్నికలు అయ్యిపోయి.. మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసేసి, ఛార్జ్ కూడా తీసేసుకున్నాడు. కానీ ఈ ఎన్నికల్లో విష్ణు అండ్ మంచు కో గెలుపు సరైంది కాదు అని వారి ప్రధాన పోటీ దారు ప్రకాష్ రాజ్ ప్యానల్ బలంగా చెబుతున్న మాట.

అయితే ప్రకాష్ రాజ్ తన హక్కుగా అడుగుతున్నాను ఎన్నికల ఓట్స్ లెక్కింపు టైం సీసీ ఫుటేజ్ కావాలని దానిని మా హక్కుగా చూడాలి అనుకుంటున్నామని తెలిపారు. దీనితో మరింత హీటెక్కిన ఈ ఎన్నికలు ఇప్పుడు ఊహించని ట్విస్ట్ చోటు చేసుకున్నాయి.

ఈ సీసీ టీవీ ఫుటేజ్ కోసం ప్రకాష్ రాజ్ అడగ్గా ఆ ఫుటేజ్ ని పోలీసులు ఇప్పుడు సీజ్ చెయ్యడం షాక్ ఇచ్చింది. అంతే కాకుండా ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ స్కూల్ ప్రాంతం సీసీ టీవీ ఫుటేజ్ రూమ్ కి కూడా తాళం వెయ్యడం మరో ట్విస్ట్ దీనితో విష్ణు గెలుపు పై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.