మరొక అరుదైన రికార్డ్ సాంతం చేసుకున్న పుష్ప.. టాలివుడ్ లో మొదటి సినిమాగా రికార్డ్..?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప . ఈ సినిమా విడుదలై దేశమంతటా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీ నుండి ఈ సినిమాకు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో అల్లుఅర్జున్ చెప్పే తగ్గేదే లే అనే డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఎవరూ చూసినా కూడా పుష్ప సినిమాలోని డైలాగ్స్ చెప్తున్నారు

ఇదిలా ఉండగా ఈ సినిమాలో కథ, నటన మాత్రమే కాకుండా సినిమాలోని పాటలు కూడా ఈ సినిమా హిట్ అవ్వటానికి ఒక కారణం. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సంచలనాలు సృష్టించాయి. ఇక ఈ సినిమాలో సమంత నటించిన ఉ అంటావా మామ ఉ ఊ అంటావా మామ అనే పాటకి ఫుల్ క్రేజ్ ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పుష్ప సినిమా మరొక కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇటీవల పుష్ప’ మ్యూజిక్ ఆల్బమ్ 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ సాధించింది. మన అల్ ఇండియా వైడ్ ఇలాంటి ఘనత సాధించిన మొదటి సినిమా పుష్ప. . దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘పుష్ప’ ఆల్బమ్ అన్నిచోట్లా అద్భుతాలు చేసింది.

అయితే గతంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి ‘పుష్ప’ సినిమా గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. రాజ్ కుమార్ హిరాణి సుకుమార్ ని పొగుడుతూ.. ‘పుష్ప’ సినిమాను ఆయన వర్ణించిన తీరు సూపర్! ఈ సినిమాలో ప్రతీ సీన్ అద్భుతం.. అలాటి సినిమా అసలు ఎలా తీసారో కూడా అంతుచిక్కడం లేదంటూ సుకుమార్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే ఈ సినిమా మీద బన్నీ పెట్టుకున్న నమ్మకం కూడా నిజమయ్యింది. బన్నీ చెప్పినట్లుగానే ‘పుష్ప’ 350 కోట్లు వసూలు చేసిందని ఇవాళ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.