మరో రికార్డును సృష్టించిన సుమ క్యాష్ కార్యక్రమం.. ఏంటంటే?

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో సుమ ప్రథమస్థానంలో ఉందని చెప్పటంలో సందేహం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర మీద ఎన్నో షోలకు యాంకరింగ్ చేస్తూ ఇంట్లో మనిషి లాగా మమేకమై పోయింది. ఎల్లప్పుడూ టీవీ షోలతో, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో బిజీగా ఉండే సుమన్ ఇటీవల పంచాయతీ అనే సినిమా లో నటించింది. తన పంచ్ లతో, కామెడీ టైమింగ్ తో యాంకర్ గా ప్రేక్షకులని అభిమానాన్ని సొంతం చేసుకున్న సుమ నటిగా తన సత్తా నిరూపించుకోవటానికి ప్రయత్నం చేస్తోంది..

ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షో కి గత కొన్ని సంవత్సరాలుగా సుమ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షోలో పార్టిసిపేట్ చేసే ఎంతోమంది సెలబ్రిటీలకు ఫన్నీ టాస్క్ లు ఇచ్చి ఒక ఆట ఆడుకుంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రసారమవుతున్న క్యాష్ షో ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో ఇటీవల 200 ఎపిసోడ్లు పూర్తి చేసుకోనుంది. ఒక షో ఇలా 200 ఎపిసోడ్ లు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయిన ఈ టీవీ లో ప్రసారమయ్యే సీరియల్స్, టీవీ షోస్ అన్ని కూడ కొన్ని వందల ఎపిసోడ్స్ వరకు కొనసాగుతూనే ఉంటాయి.

ప్రతిరోజూ ప్రసారం అయ్యే టీవీ షోస్ అయితే 200 ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న పర్వాలేదు అనుకోవచ్చు. కానీ వారానికి ఒక్కరోజు ప్రసారం అయ్యే ఈ షో 200 ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్నది అంటే నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఈ క్యాష్ షో ఇంత సక్సెస్ కావడానికి సుమ యాంకరింగ్ కూడ ఒక కారణం. మల్లెమాల వారు మంచి కంటెంట్ తో ముందుకు రావడం వల్లే ప్రేక్షకులు ఈ షో క్యాష్ షో ని ఇంతగా ఆదరించారు. మధ్యలో జీన్స్ షో రావటం వల్ల మరికొన్ని ఎపిసోడ్స్ తగ్గాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. క్యాష్ 200 ఎపిసోడ్ జరుపుకుంటున్న సందర్భంగా ఈ వారం యఫ్ 3 టీమ్ క్యాష్ షో లో సందడి చేయనున్నారు. ఇప్పటికీ ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదల అయ్యింది.