HomeNewsఊహించని లెవెల్లో "రాధే శ్యామ్" టీజర్ రిలీజ్ ప్లానింగ్ అట.!

ఊహించని లెవెల్లో “రాధే శ్యామ్” టీజర్ రిలీజ్ ప్లానింగ్ అట.!

Prabhas Announces Radhe Shyam Teaser Launch Date | Telugu Rajyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ నుంచి పాన్ వరల్డ్ లెవెల్ కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా అందుకు పావులు ఇప్పుడు నుంచే కదులుతున్నాయి. ఒక్కో సినిమా తర్వాత హాలీవుడ్ లెవెల్ కి ప్రభాస్ వెళ్లనుండగా ముందు మాత్రం టెస్టింగ్ గా ఆల్రెడీ ఇప్పుడు చేసిన సినిమాలతోనే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. లేటెస్ట్ గా తాను నటించిన “రాధే శ్యామ్” తోనే అది స్టార్ట్ అవుతున్నట్టు మరో ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు వైరల్ అవుతుంది.

రాధే శ్యామ్ టీజర్ ను ప్రభాస్ బర్త్ డే కానుకగా రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చేశారు. మరి ఈ టీజర్ నే ఇంకో లెవెల్లో రిలీజ్ చేసే ప్లాన్ లో సినిమా యూనిట్ ఉన్నారట. ఇండియన్ మెయిన్ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ భాషలో కూడా ఈ టీజర్ ని రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట. ఇది నిజంగా ఊహించని మూవ్ అని చెప్పాలి. ఇంగ్లీష్ తో పాటుగా ఇతర భాషల సబ్ టైటిల్స్ లో ఈ టీజర్ సిద్ధం చేస్తున్నారట. ఇక ఇంగ్లీష్ వెర్షన్ రాధే శ్యామ్ టీజర్ ఎలా ఉండబోతుంది అన్నది వేచి చూడాల్సిందే.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News