RRR Movie : ఇండస్ట్రీ బజ్ – “RRR” నుంచి కూడా మరో ట్రైలర్ రాబోతోందా.?

RRR Movie

RRR Movie : పాన్ ఇండియా వీక్షకులు ఎంతో ఆసక్తి ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో ఇండియా టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన న్యూ ఫిలిం ట్రిపుల్ ఆర్(RRR Movie) కూడా ఒకటి. ఇద్దరు మాస్ హీరోస్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా చేసిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ మార్చ్ 25న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఇప్పటికే ఉండాల్సిన హైప్ ఆల్రెడీ ఉంది. అలాగే సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా చిత్ర బృందం మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఇంకో భారీ ప్లాన్ చేస్తున్నారట. బహుశా ఈ సినిమా నుంచి మరో అదిరే ట్రైలర్ కట్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ బజ్. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది.

ఆల్రెడీ ఇది వరకే మరో భారీ సినిమా “రాధే శ్యామ్” నుంచి కూడా రెండో ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ గా వచ్చింది. దానితో ఆ సినిమాపై కొత్త అంచనాలు పుట్టుకొచ్చాయి. ఇదే ఫార్మాట్ లో ట్రిపుల్ ఆర్ కి కూడా రిపీట్ అవుతాయేమో అని చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, ఆలియా భట్ యూ నటించగా కీరవాణి సంగీతం అందించారు. అలాగే డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.