RRR: అతి పెద్ద స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ సినిమా ఆవిష్కరణ.. ఎప్పుడో తెలుసా..?

RRR: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో, భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇకపోతే ఈ సినిమాను యూకేలో వెయ్యి స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నారు. వాటిలో లండన్ లోని ఓడియన్ బీఫ్ ఐ మాక్స్ ఒకటి. ఇది యూకేలోని అతి పెద్ద స్క్రీన్. ఈ తెరపై ఆర్ఆర్ఆర్ సినిమాను చూడటం అనేది ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

అంత పెద్ద స్క్రీన్ ను తెలుగు సినిమా ఆక్రమించడం అన్నది గర్వ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా చారిత్రక నేపథ్యం కథగా రానున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.