“రాధే శ్యామ్” నుంచి మరో బిగ్ అప్డేట్ కూడా ఉంది కానీ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “రాధే శ్యామ్”. నిన్న ఈ సినిమా నుంచి ఎపుడు నుంచో ఎదురు చూస్తున్న భారీ అప్డేట్ టీజర్ పై వచ్చేయడంతో దానిపై మరింత ఆసక్తి నెలకొంది.

అయితే ఇది ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ప్లాన్ చెయ్యగా ఇంకో అప్డేట్ ని మరో స్పెషల్ రోజున చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తారని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. టీజర్ వచ్చేసాక బహుశా దీపావళి కానుకగా ఈ బిగ్ అప్డేట్ ని రిలీజ్ చేస్తారని సినీ వర్గాల్లో వైరల్ అవుతున్న టాక్.

అయితే ఈ అప్డేట్ ప్రభాస్ రిలేటెడ్ గా ఉండకపోవచ్చట. కానీ పూజా హెగ్డే చేస్తున్న ప్రేరణ పాత్రకు రిలేటెడ్ గా కానీ మరో ఆసక్తికర అప్డేట్ ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.