బిగ్‌బాస్ షోకు షాక్.. అన్నపూర్ణ స్టూడియో భారీ అగ్ని ప్రమాదం

అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటల్ని ఆర్పివేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఎటు వంటి ప్రాణనష్టం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఈ మేరకు స్టూడియో యాజమాన్యం ఓ ప్రకటనను కూడా చేసింది. ఓ సినిమా షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Annapurna Studios Fire Accident Video goes viral
Annapurna Studios Fire Accident Video goes viral

అయితే ఈ మేరకు సోషల్ మీడియాలో విజువల్స్ వైరల్ అవుతున్నాయి. మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ కమ్రంలో ఎటువంటి ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని స్టూడియో నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ఇదంతా ఓ వైపు అక్కడే వేసిన బిగ్ బాస్ సెట్‌కు ఏమైనా జరిగిందా? షోకు అంతరాయం కలుగుతుందా? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌ స్టూడియోలో బిగ్‌బాస్‌ సెట్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి దగ్గర్లోనే బిగ్ బాస్ సెట్ ఉండటంతో అందరూ ఆందోళనం చెందుతున్నారు. మంటలు అంతగా ఎగిసిపడకపోవడంతో బిగ్‌బాస్‌‌కు ఎలాంటి అంతరాయం కలగదని అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నారు.