మరోసారి ఐటెం భామగా మారిన అంజలి..ఈసారి డోస్ కూడా పెంచినట్టు ఉందే.!

ఒకప్పుడు అంటే సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి అంటూ ప్రత్యేకంగా కొందరు స్టార్ బ్యూటిలు ఉండేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ కూడా మారుతుండడంతో కొందరు హీరోయిన్స్ కూడా ఐటెం గర్ల్స్ గా మారారు. అలా లేటెస్ట్ గా సమంతా, పూజా హెగ్డే లు కూడా మారి సెన్సేషన్ రేపుతుండగా మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ గా రెండో సారి ఐటెం గర్ల్ గా మారింది. 

మరి ఆమె ఎవరో కాదు రీసెంట్ గా వకీల్ సాబ్ తో ఆకట్టుకున్న నటి అంజలి. ఈ హీరోయిన్ ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో “సరైనోడు” సినిమాలో ఫస్ట్ టైం ఈ స్టెప్ తీసుకొని పర్వాలేదనిపించింది. కానీ ఈసారి యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న సాలిడ్ ఏక్షన్ డ్రామా “మాచర్ల నియోజకవర్గం” లో మెరిసేందుకు సిద్ధం అయ్యింది. 

దీనిపై ఇప్పుడు చిత్ర బృందం అనౌన్సమెంట్ చేయగా ఇందులో అంజలిని చూస్తే మాత్రం గతంలో కంటే గ్లామర్ డోస్ ని బాగా పెంచినట్టు అయ్యిందని చెప్పాలి. తన ఫిట్నెస్  లెవెల్స్ ని కూడా ఆమె చాలా హాట్ గా సెటప్ చేసుకుందని చెప్పాలి. మొత్తానికి అయితే అంజలి మాత్రం ఈ సినిమాలో మంచి ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తుంది.