2012లో వచ్చిన నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనిత. ఈ చిత్రంలో అద్భుతమైన నటనా పటిమ కనబరచి ప్రేక్షకుల మనసులు దోచుకున్న అనిత ఆ తర్వాత ‘శ్రీరామ్’ ‘తొట్టి గ్యాంగ్’ ‘నిన్నే ఇష్టపడ్డాను’ ‘ఆడంతే అదో టైపు’ ‘నేను పెళ్ళికి రెడీ’ వంటి చిత్రాల్లో నటించింది. నాగార్జున హీరోగా వచ్చిన ‘నేనున్నాను’ సినిమాలో ఓ పాటలో మెరిసింది. ఇక తమిళంలోను పలు చిత్రాలు చేసింది. అయితే ఈ చిత్రాలు అనిత కెరీర్‌కు పెద్దగా హెల్ప్ కాలేకపోయాయి. దీంతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.
నాగిణఙ అనే హిందీ సీరియల్‌తో చాలా ఫేమస్ అయిన అనిత ఆ తర్వాత కూడా ఎక్కువ సీరియల్స్‌తోనే బిజీగా ఉంది. 2013లో పారిశ్రామిక వేత్త రోహిత్‌ను వివాహం చేసుకున్న అనిత రీసెంట్‌గా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని దంపతులిద్దరు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. వీరికి నెటిజన్స్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అనిత-రోహిత్‌ల కుమారుడు ఎలా ఉన్నాడు, ఎవరి పోలికలు వచ్చాయో అని అందరు చర్చలు నడుపుతున్న నేపథ్యంలో అనిత దంపతులు కుమారుడి ఫొటోని ప్రపంచానికి పరిచయం చేశారు.
తమ బిడ్డ సైడ్ ఫేస్ చూపిస్తూ అనిత దంపతులు ఫొటో దిగగా, ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అనిత పోలికలే కనిపిస్తున్నాయి కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనిత గర్భవతిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గర్భంతో పలు ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాని షేక్ చేసింది.