అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3. తాజాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని నందమూరి నటసింహం బాలకృష్ణతో చేయనున్నట్లు ప్రకటించారు.ఇకపోతే నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో మోక్షజ్ఞ రాజమౌళి, పూరి జగన్నాథ్, వివి వినాయక్ వంటి దర్శకుల చేతి నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత బాలకృష్ణ అనిల్ రావిపూడికి అప్పగించినట్లు పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. అనిల్ రావిపూడి అయితేనే మోక్షజ్ఞ ఎంట్రీకి ప్లస్ అవుతుందని అందుకే ఈ బాధ్యతలను అనిల్ కి అప్పగించినట్టు పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.ఇలా మోక్షజ్ఞ గురించి వస్తున్న వార్తల్లో ఏ విధమైనటువంటి క్లారిటీ లేక నందమూరి అభిమానులు సైతం ఎంతో ఈ విషయం గురించి ఆతృత కనబరుస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి ఎట్టకేలకు ఈ సినిమా పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ వార్త నా వరకు వచ్చింది కనుక ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను అంటూ ఆయన వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి తన దగ్గర ఎప్పుడూ కూడా ప్రస్తావించలేదని అనిల్ క్లారిటీ ఇచ్చారు.ఒకవేళ బాలకృష్ణ ఆ బాధ్యత నాకు కనుక ఇస్తే తప్పకుండా మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేస్తానని తెలిపారు.అయితే ప్రస్తుతం తన దృష్టి మొత్తం బాలకృష్ణ సినిమా పైనే ఉందని ఈ సందర్భంగా మరోసారి అనిల్ రావిపూడి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.