భర్త అనుమానిస్తున్నాడన్న కోపంతో.. దారుణంగా కొట్టి చంపిన భార్య..!

ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ క్షణికావేశంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పచ్చని సంసారాలు బీటలు వారుతున్నాయి. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం లేదా హత్య చేయడం వల్ల ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలను అనాధలను చేసి వెళ్తున్నారు. కేవలం ఇవన్నీ కూడా అనుమానం అనే ఒక పెనుభూతం కారణంగా ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన చెన్నైలోని అరుంబక్కంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

అరుంబక్కంలోని డాక్టర్.రాధాకృష్ణన్ నగర్‌కు చెందిన ధనలక్ష్మి, అనంతకుమార్ భార్య భర్తలు ఉండేవారు. అనంత కుమార్ ప్రతి రోజూతాగి వచ్చి ధనలక్ష్మితో గొడవ పడటమే కాకుండా తనని అనుమానించే వాడు. దీంతో విసిగిపోయిన ధనలక్ష్మి తన భర్తను బలంగా కొట్టడంతో అతను మరణించాడు. ఈ క్రమంలోనే కేబుల్ వైర్ తో అతనికి ఉరివేసి గాయాలు చేసుకుని ఆసుపత్రి పాలైంది.ఇక వైద్యులకు తన భర్త హింసించడం వల్ల గాయాలపాలయ్యారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఇంటికి వెళ్లారు.

ఇంటి బయట తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చి తాళం పగులగొట్టి చూడగా అనంతకుమార్ ఉరికి వేలాడుతూ కనిపించారు. అయితే ఇది ఆత్మహత్య కాదు హత్య అని అనుమానించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో తన భార్య ధనలక్ష్మిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా తానే తన భర్తను చంపి అలా ఉరి వేశానని ఒప్పుకోవడంతో అసలు విషయం బయటపడింది.