డైరెక్టర్ అడిగాడిని నగ్నంగా నటించిందట !

Andrea did bold performance on directors request
Andrea did bold performance on directors request
 
బోల్డ్ క్యారెక్టర్స్ ఎంచుకోవడంలో తమిళ నటి ఆండ్రియా ఎప్పుడు ముందుంటుంది.  ఇప్పటికే పలు సినిమాల్లో బోల్డ్ పెర్ఫార్మన్స్ చేసిన ఆమె తాజాగా అలాంటి ప్రయత్నమే మరొకటి చేసిందట.  ఆండ్రియా చేస్తున్న సినిమాల్లో ‘పిశాసు-2’ కూడ ఒకటి.  మిస్కిన్ ఈ చిత్రానికి దర్శకుడు.  2016లో విడుదలైన ‘పిశాసు’ చిత్రానికి ఇది సీక్వెల్.  ఇందులో ఆండ్రియా టైటిల్ రోల్ చేస్తోంది.  దర్శకుడిగా మిస్కిన్ కు ఒక ప్రత్యేకత ఉంది. సన్నివేశాలను, పాత్రలను ఆయన చాలా కళాత్మకంగా కంపోజ్ చేస్తారనే పేరుంది.  సినిమాటిక్ అనుభూతి కావాలంట ఆయన సినిమాలు చూడాల్సిందే.  
 
నటీనటులు కూడ ఆయన సినిమాలంటే అమితమైన ఆసక్తి చూపిస్తుంటారు.  అంత సెన్సిబుల్ డైరెక్టర్ కాబట్టే ఒక సన్నివేశంలో నగ్నంగా నటించాల్సి ఉంటుందని అడగ్గానే ఆండ్రియా ఎక్కువ ఆలోచించకుండా ఒప్పేసుకుందట.  ఆ సన్నివేశాల చిత్రీకరణ కూడ పూర్తయిందట.  అతికొద్ది మంది క్రూ సమక్షంలోనే ఆ సన్నివేశాలను షూట్ చేయడం జరిగిందని తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.  రొమాంటిక్ సీన్ల దగ్గరే బోలెడన్ని  రిస్ట్రిక్షన్స్ పెడుతూ నానా హంగామా చేసే హీరోయిన్లు ఉన్న ఈరోజుల్లో డైరెక్టర్ అడగ్గానే సన్నివేశం ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ధైర్యం చేసినందుకు ఆండ్రియా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు చాలామంది.