విక్రమ్ హిట్ కావడంతో డైరెక్టర్ కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చిన కమల్!

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. ఈ సినిమా జూన్ 3వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే మొదటి షోతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజులకు ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది.కమల్ హాసన్ కొన్ని కారణాల వల్ల గత నాలుగు సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే విక్రమ్ సినిమా ద్వారా వెండితెర సందడి చేసిన కమల్ హాసన్ ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ పజిల్ కీలక పాత్రలో నటించగా క్లైమాక్స్ చివరి ఐదు నిమిషాలలో సూర్య ఎంట్రీ ఈ సినిమాకు మరింత హైలైట్ అయింది అని చెప్పాలి.ఇక పోతే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను మించి కలెక్షన్లను రాబడుతోందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సుమారు ఐదు నుంచి పది కోట్ల వరకు కలెక్షన్లను సాధించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలోనే కమల్ హాసన్ ఈ సినిమా మంచి విజయం కావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత హ్యాపీ మూమెంట్ లో ఇంత మంచి విజయాన్ని తనకు అందించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కి కమల్ హాసన్ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోటి రూపాయలు విలువచేసే కారును బహుమతిగా ఇస్తూ ఆ కార్ బిగ్ కీ ను కమల్ హాసన్ దర్శకుడికి అందించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.