Home Andhra Pradesh ఏపీని వణికిస్తున్న కరోనా.. పరిస్థితి చేయి దాటుతోంది 

ఏపీని వణికిస్తున్న కరోనా.. పరిస్థితి చేయి దాటుతోంది 

ఏపీలో కరోనా విజృంభణ రోజు రోజుకూ ఎక్కువవుతోంది.  గడిచిన 24 గంటల్లో 3963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఇదే ఇప్పటి వరకు హయ్యస్ట్ నెంబర్.  23,872 శాంపిల్స్ టెస్ట్ చేయగా 3963 కేసులు బయటపడ్డాయి.  ఎన్ని కేసులు వచ్చినా ఇన్నాళ్ళు మరణాల రేటు తక్కువగా ఉండటంతో ప్రజలు కొంత ధైర్యంగాంనే ఉన్నారు.  కానీ గత కొత్త హెల్త్ బులిటెన్లో మరణాలు 50 దాటాయి.  దీంతో ప్రజల్లో కంగారు మొదలైంది.  రాష్ట్రంలో కరోనాకు ఒక జిల్లా హాట్ స్పాట్ అని లేదు.  ప్రతి జిల్లాలో భారీ సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి.  రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడమే కానీ తగ్గే సూచన కనిపించట్లేదు. 
 
ఇంతకు ముందు బయటపడే కేసుల్లో కనీసం ఇతర రాష్ట్రాల నుండి దేశాల నుండి వచ్చేవారివి ఉండేవి.  కానీ ఈసారి మాత్రం 3963 కేసులు కూడా స్థానికంగా బయటపడినవే.  దీన్నిబట్టి రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.  కొందరైతే సామాజిక వ్యాప్తిగా రూపాంతరం చెందిందా అనే అనుమాణాలు వ్యక్తం చేస్తున్నారు.  ఇక్కడ మరొక చిత్రమేమిటంటే ఎక్కువ కేసులు అర్బన్ ఏరియాల్లోనే నమోదవడం.  ఈ పరిణామం పల్లెల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉందని అర్థమవుతోంది. 
 
తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 994 కేసులు నమోదవగా, కర్నూల్ జిల్లాలో 550, పశ్చిమ గోదావరి జిల్లాలో 407, చిత్తూరు జిల్లాలో 343, నెల్లూరు జిల్లాలో 278, ప్రకాశంలో 266, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో 200కు పైగానే నమోదుకాగా అత్యల్పింగా విశాఖలో 116 కేసులు నమోదయ్యాయి.  మునుపు జిల్లాలో  రోజుకు 100 కేసులంటే అమ్మో అనేవారు.  కానీ ఇప్పుడు 100 అనేది చాలా కామన్ నెంబర్ అయిపోయింది.  మరోవైపు పెద్ద సంఖ్యలో టెస్టులు చేస్తున్న ప్రభుత్వం వైద్య సదుపాయాలు, సరిపడా కోవిడ్ ఆసుపత్రులను, బెడ్లను ఏర్పాటు చేయడంలో వెనుకబడుతోందనే విమర్శలూ ఉన్నాయి.  
 

Related Posts

వివాదాల ‘రిపబ్లిక్’ పరిస్థితి ఏమవుతుందబ్బా.!

రిలీజ్‌కి ముందు వివాదాలు.. అనుకోకుండా ఆయా సినిమాలపై అంచనాలు పెంచేస్తుంటాయి. గతంలో చాలా సార్లు ఈ పరిణామాలు చూస్తూనే వచ్చాం. అయితే, ఈ సారి వివాదం కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంతకీ...

హుజూరాబాద్ బై పోల్: ఈటెల సంగతేంటో తేలిపోనుంది.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తుకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో శుభం కార్డు పడుతుందా.? అధికా తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ పైచేయి సాధిస్తుందా.? దళిత బంధు పథకం సంగతేంటి.? హుజూరాబాద్...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News