మరి అప్పుడు సీఎంగా బరిలోకి దిగేంత ఛరిష్మా ఎవరికి ఉంది అంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే అనాలి. బీజేపీ సారథి సోము వీర్రాజు నో…మరో నాయకుడినే సీఎం అభ్యర్ధిగా నుంచో పెడితే పని జరగదన్నది తెలిసిందే. అందుకే బీజేపీ కి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ కూడా పవన్ కళ్యాణ్ ఒక్కరే. కాబట్టి బీజేపీ కి పవన్ తప్ప మరో దారి కూడా లేదు. 2024 ఎన్నికల్లో రెండు పార్టీలు కూటమీగానే బరిలోకి దిగుతాయి అన్నది సుస్పష్టం. అందుకే ఇప్పటి నుంచి రెండు పార్టీలు క్షేత్ర స్థాయిలో బలమైన పునాదులు వేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఇరువురి మధ రాజకీయాలకు సంబంధించి కీలక అంశాలు ప్రస్థావనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి 2024 ఎన్నికల్లో కచ్చితంగా రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేసారు. అంటే ఈ రెండు పార్టీల వెనుక చిరంజీవి ఉన్నారు అని ఓ క్లారిటీ దొరికింది. త్వరలో మాజీ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో సోము వీర్రాజు భేటీ కానున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముద్రగడని తమ పార్టీ కండువా కప్పే లా చేయాలని గట్టిగా ప్రయత్నాలు మొదలపెట్టినట్లు ఇప్పటికే కథనాలు వేడెక్కిస్తున్నాయి. వంగవీటి రాధా లాంటి నాయకులకి ఎర్ర తివాచీ వేసి పార్టీలోకి ఆహ్వానించాలని వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో పవన్ కళ్యాణ్ బలం పెంచేలా బీజేపీ ఆయనకు కేంద్ర కేబినేట్ ఏదైనా పదవి కట్టబెట్టాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా జనసేనాని బలం రోజు రోజుకి పెరుగుతున్నట్లే కనిపిస్తోంది.