హైపర్ ఆదితో ప్రేమలో పడిన యాంకర్ వర్షిని.. జీవితాంతం నీ తోడు కావాలి అంటూ షాకింగ్ పోస్ట్?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా పరిచయమైన అతి తక్కువ సమయంలోనే టీమ్ లీడర్ గా పేరు సంపాదించుకున్న హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అయినప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాల ద్వార ఎంతో మంది కమెడియన్ల మధ్య లవ్ ట్రాక్ లు చూపించడం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది కమెడియన్ల మధ్య ఇలాంటి లవ్ ట్రాక్స్ క్రియేట్ చేశారు. ఇక ఇలాంటి కార్యక్రమాలలో హైపర్ ఆదికి ఎంతోమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా హైపర్ ఆది పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే హైపర్ ఆదితో పాటు యాంకర్ వర్షిని తనతో కలిసి ప్రైవేట్ పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఆదితో కలిసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడమే కాకుండా తనకు ప్రేమగా కేక్ తిన పెడుతూ తనని కౌగిలించుకున్నటి వంటి వీడియోని వర్షిని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన ఎంతోమంది వీరిద్దరి వ్యవహారశైలి గురించి ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ వీడియోని షేర్ చేస్తూ వర్షిని..డియర్ ఆది.. హ్యాపీ బర్త్ డే. నా జీవితం మొత్తం నీవు తోడుగా ఉండాలి. నా ఫేవరిట్ పర్సన్, సపోర్ట్ సిస్టం నువ్వే. రైటర్ ఆది నువ్వు నాకు రైట్ రా ఆది’ అంటూ వర్షిణి లవ్ ఎమోజిలు పోస్ట్ చేసింది. ఈ విధంగా ఈమె ఆది గురించి ఇలాంటి క్యాప్షన్ జోడించడంతో ఎంతో మంది నెటిజన్లు వీరి వ్యవహారశైలిపై సందేహాలను వ్యక్తం చేస్తూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు.అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా లేదా అనే విషయం తెలియాలంటే ఈ విషయం పై హైపర్ ఆది లేదా వర్షిని స్పందించాల్సి ఉంది.