Ram Charan: నాన్న అంటే భయమా? ఉపాసన అంటే భయమా? చరణ్ ను ఇరకాటంలో పెట్టిన సుమ.. చరణ్ సమాధానం ఇదే!

Ram Charan: మెగా స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆచార్య.ఈ సినిమా ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ నెల 23న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా యాంకర్ సుమ రామ్ చరణ్ ను బాగా ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగారు.

ఈ సందర్భంగా ఈ వేదికపైనే రామ్ చరణ్ ప్రశ్నిస్తూ మీకు నాన్న చిరంజీవి గారు అంటే భయమా లేక మీ భార్య ఉపాసన అంటే భయమా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నాన్న అమ్మ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు. అది చూసి నేను కూడా ఉపాసన దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాను. అయినా మా ఇంట్లో మా బాస్ అమ్మనే.. అది నాన్నగారికి అయినా లేదా బాబాయ్ పవన్ కళ్యాణ్ కైనా, నాకైనా మా అమ్మే బాస్ అంటూ చరణ్ తన తల్లి గురించి సమాధానం చెప్పారు.

ఈ విధంగా సుమ అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ ఎంతో తెలివిగా సమాధానం చెప్పారు.ఇక ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.