నడిరోడ్డు మీద స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్న సుమ.. వైరల్ అవుతున్న వీడియో..!

బుల్లితెర మీద సందడి చేస్తున్న యాంకర్లలో సుమ కనకాల ఒకరు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర మీద షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర మహారాణిగా వెలుగొందుతోంది. తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. టీవి షో లతో పాటు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో కూడా యాంకరింగ్ చేస్తు నిత్యం బిజీగా ఉంటోంది. అంతేకాకుండా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనకి సంబందించిన విషయాలనూ అభిమానులతో పంచుకుంటుంది.

నిత్యం షోస్ తో బిజీగా ఉండే సుమ ప్రస్తుతం న్యూయార్క్ లో సందడి చేస్తోంది. తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టాటా) వారి ఆహ్వానం మేరకు న్యూయార్క్ వెళ్లిన సుమ అక్కడ ఈవెంట్ ని హోస్ట్ చేసి వారి సత్కారాన్ని స్వీకరించింది. అయితే ఈ కార్యక్రమానికి యాంకర్ రవి కూడా హోస్ట్ గా వ్యవహరించాడు. సుమతో పాటు యాంకర్ రవి కుటుంబం కూడా న్యూయార్క్ లో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత వెకేషన్ కి వెళ్ళిన సుమ ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటోంది. న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ అక్కడి రెస్టారెంట్లలో స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది.

అంతేకాకుండా తాజాగా రాత్రివేళ న్యూయార్క్ నడి వీధుల్లో డాన్స్ చేస్తూ చిల్ అవుతోంది. తాజాగా సుమ ఈ వీడియోని సోషియల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో సుమ తన టీమ్ తో కలిసి బీస్ట్ సినిమాలోని పాటకు డాన్స్ చేస్తూ సందడి చేసింది. అయితే ఎప్పుడు ట్రెడిషనల్ గా కనిపించే సుమ ఈ వీడియోలో మాత్రం జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకొని పాటకి డాన్స్ చేసే విధానం అందరికీ నవ్వు తెప్పిస్తుంది. మొత్తానికి తన బిజీ లైఫ్ కి కొన్నిరోజులు బ్రేక్ ఇచ్చి సుమ బాగానే ఎంజాయ్ చేస్తోంది.