బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో సుమ ప్రథమ స్థానంలో ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఒకవైపు టీవీ షోస్, సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరొకవైపు సినిమాలతో ఎల్లప్పుడూ బిజీగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో ఉన్న యాంకర్లలో సుమ తన యాంకరింగ్ తో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఇంట్లో మనిషి లాగా మమేకమై పోయింది. సుమ ఎక్కడ ఉంటే అక్కడ చాలా సందడిగా ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ సుమ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అంటే ఆవిడ పాపులారిటీ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది సామాన్య ప్రజలను, అటు స్టార్ హీరోస్ సైతం సుమ మాట్లాడే మాటలతో ఎప్పుడు ఇబ్బంది పడలేదు.
గత కొన్ని సంవత్సరాలుగా యాంకర్ గా రాణిస్తున్న సుమ గురించి ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ వినిపించలేదు.కానీ ఈ మధ్య సుమ యాంకరింగ్ విషయంలో ప్రేక్షకుల నుండి నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ మధ్య జరిగిన ఓ విషయంలో కూడా ప్రేక్షకుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినిమా యాంకరింగ్ చేస్తున్న రియాలిటీ షోలలో అవే పాత పంచులు, కుళ్లు జోకులతో ప్రేక్షకులు బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో సుమ ఎక్కువగా తనని తాను పొగుడుకోవటం ఎక్కువయ్యింది. ఇటీవల జరిగిన” సర్కారు వారి పాట” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ఏవి వేయించుకుంది. అంతే కాకుండా నిన్న జరిగిన ఈవెంట్ లో సుమ యాంకరింగ్ చాలా బోర్ కొట్టిందని ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా ఇటీవల సుమ చిన్న హీరోలు, దర్శకుల పట్ల ఆమె ప్రవర్తించే తీరు సరిగా లేదని ఆమె మీద నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనం ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో డైరెక్టర్ చేతిలో ఉన్న మైక్ లాక్కుంది. అందువల్ల సుమ యాంకరింగ్ విషయంలో ఎటువంటి హంగులు లేకుండా మునుపటిలా యాంకరింగ్ చేస్తే బాగుంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యాంకరింగ్ విషయంలో తన తీరు మార్చుకోవటం చాలా ముఖ్యమని ఇలాగే వ్యవహరిస్తే కష్టం అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.