ఇండస్ట్రీలో పాతుకుపోయిన సీనియర్ యాంకర్లు.. ఈ యాంకర్లకి రిటైర్మెంట్ ఉండదా..?

మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ మంది యాంకర్లు మాత్రమే రాణిస్తున్నారు. కొత్త యాంకర్లు వచ్చినా కూడా సీనియర్లకు పోటీగా నిలవలేక పోతున్నారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం అని అంటుంటారు . ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవటానికి గ్లామర్ చాలా అవసరం. అది హీరోయిన్ అయినా కావచ్చు లేక యాంకర్ అయినా కావచ్చు. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వయసుతో సంబంధం లేకుండా ఎన్నో ఏళ్లుగా కొంతమంది యాంకర్లు ఇండస్ట్రీలో పాతుకుపోయారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా వీరికి ఈ పని లో రిటైర్మెంట్ అనే పదానికి తావు లేదని అంటున్నారు.

ఇలా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో యాంకర్లు గా గుర్తింపు పొందిన వారిలో సుమ, అనసూయ, ఉదయ భాను, ఝాన్సీ వంటి వారు ఉన్నారు. సుమ, ఝాన్సీ అయితే 90 లలో ఇండస్ట్రీకి వచ్చారు. ఒక ఏడాది అటు ఇటుగా వీరిద్దరూ ఒకేసారి టెలివిజన్ లో రంగ ప్రవేశం చేశారు. అయితే ఇప్పటికీ వీరికి అవకాశాలకు కొదువ లేదు. ఇక ఉదయ భాను కూడా కొంతకాలం విరామం తీసుకున్నా కూడా మరి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతోంది. ఇక అనసూయా కూడా దాదాపుగా 10 ఏళ్లుగా యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇద్దరూ పిల్లలకు తల్లి అయినా కూడా ఇప్పటికి తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది.

ఇలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యాంకర్లకు టాలెంట్ తో తప్ప వయసుతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తున్నాయి. ఇక రష్మి కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా రాణిస్తుంది. బుల్లితెర మీద ప్రసారమవుతున్న కొత్త టీవీ షోస్ లో కూడా ఈ పాత యాంకర్లే సందడి చేస్తున్నారు. ఇప్పటికే మా టీవీలో ప్రసారమవుతున్న కొత్త టీవీ షోస్ కి అనసూయ యాంకరింగ్ చేయగా.. ఈ టీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో రష్మి సందడి చేస్తోంది. మొత్తానికి ఇండస్ట్రీలో అందంతో పని లేకుండా ప్రేక్షకులని ఆకట్టుకునే యంకర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల ఇంతకాలం గడిచినా కూడా వీరు యాంకరింగ్ లో రిటైర్మెంట్ తీసుకోకుండా కష్టపడుతున్నారు.