Ravi Wife Nitya: బిగ్ బాస్ కార్యక్రమం నుంచి 12వ వారం బయటకు వచ్చిన తర్వాత యాంకర్ రవి ప్రతి రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త ద్వారా హల్ చల్ చేస్తున్నారు.తను బిగ్ బాస్ హౌస్ లో ఇంత మంచిగ ఉన్నా కావాలని నాపై నెగిటివిటీని క్రియేట్ చేయడం కోసం అలాంటి కంటెంట్ చూపించారని హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రవి అసలు విషయం బయట పెట్టారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన గురించి చాలామంది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసే నెగిటివ్ కామెంట్లు చేశారని కేవలం తన గురించి మాత్రమే కాకుండా తన భార్య నిత్య కూతురు గురించి కూడా ఇలాంటి కామెంట్లు చేశారు అంటూ పెద్ద ఎత్తున రవి ఆరోపించి వారిపై సైబర్ క్రైమ్ పోలీస్ కేస్ చేస్తా అంటూ నానా హంగామా చేస్తున్నారు.
ఈక్రమంలోనే రవి భార్య నిత్య కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విషయంపై ఘాటుగా విమర్శలు చేశారు. బిగ్ బాస్ కి వెళ్లేముందు రవి పూర్తిగా నన్ను ఎంతో స్ట్రాంగ్గా ఉండమని చెప్పి వెళ్ళారు. ఇలాంటి కామెంట్స్ వస్తాయి వాటిని ఎదుర్కోవాలని చెప్పారు. అయితే నెటిజన్లు నుంచి వచ్చే ఆ కామెంట్ ను నేను భరించలేకపోయాను. ఈ క్రమంలోని రవి అకౌంట్ ఓపెన్ చేయకపోవడంతో నా అకౌంట్ కు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఎంతోమంది ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇలా మమ్మల్ని టార్గెట్ చేశారు. ఇక నేను అలాంటి వారిని బ్లాక్ చేయడంతో నేను ఎవరినైతే బ్లాక్ చేశానో వారి నుంచి తన కూతురికి కూడా నెగిటివ్ కామెంట్లు వచ్చాయని ఈమె వెల్లడించారు.
మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఫేక్ అకౌంట్ నుంచి కాకుండా మీ రియల్ అకౌంట్ నుంచి పోస్టులు పెట్టండి మీరు మాట్లాడేది నిజమైతే భయపడాల్సిన పని ఏంటి? మరి ఇంతగా దిగజారిపోయి కామెంట్ చేయాలా? అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఏ కంటెస్టెంట్ అయినా నచ్చితే వారి గురించి భజన చేసుకోండి అంతేగాని పక్కవారి గురించి ఇలా నెగిటివ్ కామెంట్ చేయడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నిత్య తన గురించి తన కూతురు గురించి చేసిన వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.