అయ్యో యాంకర్ రవి మళ్లీ ముంచేశాడుగా.!

Anchor Ravi Repeats Same Mistake | Telugu Rajyam

బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో అంతంత మాత్రంగా నడుస్తోంది. ఎంత చేసినా, ఈ షో జోరు మాత్రం పెరగడం లేదు. ఇదిలా ఉంటే, వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన రవి కారణంగా మొదట్నుంచీ ఎవరో ఒకరు బలైపోతూ వస్తూనే ఉన్నారు. రవి ఇచ్చే ఉచిత సలహాల్ని గుడ్డిగా నమ్మి దిబ్బయిపోతున్నారు కొందరు కంటెస్టెంట్లు.

గతంలో రవి కారణంగానే లహరి ఏకంగా హౌస్ నుండే బయటికి వెళ్లిపోవల్సి వచ్చింది. ఆ ఇష్యూకి సంబంధించి సారీ చెప్పి తాను మారిపోయానని ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు యాంకర్ రవి. కానీ, అదంతా తన గుంట నక్క నేచర్‌లోని ఓ స్ర్టాటజీ మాత్రమే అని నిరూపించుకున్నాడంతే.

ఆ తర్వాత కాజల్ విషయంలోనూ రవి పరాభవం పాలైన సంగతి తెలిసిందే. అయితే, కాజల్ చాలా తెలివైంది కాబట్టి, రవి జిత్తుల మారి చిత్తులకు బలి కాకుండా తప్పించుకోగలిగింది. కానీ, తాజాగా మరో కంటెస్టెంట్ రవి జిత్తులకు చిక్కి చిత్తైపోయింది.

ఆమె ఎవరో కాదు, శ్వేత. బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్‌లో రవి సలహాని పాటించినందుకు వరస్ట్ ఫర్‌ఫామర్ అనిపించుకుని, పనిష్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది పాపం శ్వేత. రవి సీక్రెట్ సలహా బయటికి రాలేదు. కానీ, శ్వేత మాత్రం ఆ జిత్తుల మారి సలహాకు దారుణంగా బలైపోయింది పాపం.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles