ప్రస్తుతం వేసవి సెలవలు పూర్తి కావడంతో పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి సిద్దమవుతున్నారు. ఇక పిల్లల తల్లి తండ్రులు తమ పిల్లలను స్కూల్ కి పంపించడానికి సిద్దమవుతున్నారు. ఇక కొందరు తల్లి తండ్రులు స్కూల్ కోసం అన్నీ రెడీ చేస్తుంటారు. పుస్తకాలు, యూనిఫామ్స్ అంటూ షాపింగ్‌లతో బిజీగా మారుతుంటారు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పిల్లల విషయంలో సాధారణ తండ్రిగా మారుతుంటారు. ఇక యాంకర్ రవి సైతం తన కూతురి విషయంలో సాధారణ తండ్రిగా మారిపోయాడు.
రవి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటీకీ, ఒక కూతురికి తండ్రిగా తన భాద్యతలను నెరవేరుస్తున్నారు.
తన పాప వియా కోసం రవి ఇప్పుడు సాధారణ తండ్రిలా మారిపోయాడు. పుస్తకాలకు అట్టలు వేస్తూ ఎంతో జాగ్రత్తగా రెడీ చేస్తున్నారు. మన చిన్నప్పుడు ప్రతి ఒక్కరికీ కూడా తన తల్లి తండ్రులు ఈ విధంగా స్కూల్ కివెళ్లే ముందు మన పుస్తకాలకు కూడా ఇలా అట్టలు వేస్తూ అన్ని సిద్ధం చేసి పెడుతుంటారు. తాజాగా రవి కుడా ఇలా తన కూతురికి ఒక తండ్రిగా బాధ్యతలు నెరవేర్చారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటోలను రవి ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పోతే రవి బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆయన అమెరికాలో టాటా వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే రవితో పాటు తన భార్య, కూతురు కూడా న్యూయార్క్ వెకేషన్ లో ఎంజాయ్ చేశారు. వీరి న్యూయార్క్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.