Anchor Ravi: వంటలు చేస్తున్న యాంకర్ రవి.. వీడియో వైరల్?

Anchor Ravi: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నాడు. యాంకర్ రవి కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే యాంకర్ రవి తన కెరీర్ పరంగా ఎంత యాక్టివ్ గా ఉంటాడో అదే విధంగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు, తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. యాంకర్ రవి తన ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక యాంకర్ రవి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

యాంకర్ రవి ఎలా అయినా బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడు అని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయిన బయటకు వచ్చేశాడు. రవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు పలువురు అతడి ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ వారికి అసభ్యకరంగా మెసేజ్ లు చేయడం, వారిని సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి చేయడంతో విసిగిపోయిన రవి తన ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకునేది లేదు అంటూ అటువంటి అసభ్యకరమైన మెసేజ్ లు చేసిన వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అలా నెగిటివ్ గా కామెంట్స్ చేసేవారు నెక్స్ట్ టైం ఎవరికైనా మెసేజ్ చేయాలి అంటే భయపడే విధంగా ఆ విషయంలో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు యాంకర్ రవి.

ఇదిలా ఉంటే యాంకర్ రవి కి తన కూతురు వియా అంటే ప్రాణం అన్న విషయం అందరికి తెలిసిందే. తన కూతురు కోసం రవి చికెన్ మటన్ స్పెషల్ గా వండుతాడు అన్న విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన కూతురు కోసం మటన్ కూర వండాడు. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోని షేర్ చేస్తూ హ్యాపీ కనుమ.. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.. కుమ్మేయండి.. నేను కూడా అదే పనిలో ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో ఫై నెటిజన్లు రక రకాలుగా స్పందించారు. ఒక లేడీ ఫ్యాన్ ఆ వీడియో కి కామెంట్ చేస్తూ అబ్బా.. నోరూరుతుంది అని కామెంట్ చేసింది. వెంటనే రవి ఇంటికి వచ్చేయండి అంటూ రిప్లై ఇవ్వగా.. ఆ అభిమాని గాలిలో తేలిపోయింది. సదరు లేడీ ఫ్యాన్ కు ఎంతో ఇష్టమైన యాంకర్ రవి రిప్లై ఇవ్వడం తో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్భై పోయింది.