ఆశు ని వరెస్ట్ కంటెస్టెంట్ అన్న యాంకర్ రవి.. మధ్యలో వచ్చి వెళ్లిపోయిన ఆశు?

ఒటిటి లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ప్రస్తుతం చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ చివరి దశకు చేరువలో ఉంది. పోయిన వారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో ఆశు రెడ్డి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అరియానా, బిందు మాధవి, శివ, అఖిల్, బాబా భాస్కర్ మాస్టర్, నటరాజ్ మాష్టర్, మిత్ర, అనిల్ కొనసాగుతున్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ఆశు రెడ్డి బిగ్ బాస్ బజ్ లో పాల్గొంది. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారి మనసులో మాటలు బయటపెట్టడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఇటీవల ఆశు రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి వచ్చిన ఆశు రెడ్డి వచ్చిరాగానే రవి మాట్లాడుతూ.. నువ్వు ఎలిమినేట్ అయినందుకు బాధగా ఉన్నా..నిజానికి నీకు కంగ్రాట్స్ చెప్పాలని ఉంది అని అంటాడు. ఎందుకు అని ఆశు అడగ్గా.. ఎప్పుడో హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వాల్సిన నువ్వు ఇంత కాలం నెట్టుకొచ్చావు గుడ్ జాబ్ అని సెటైర్ వేసాడు. ఆ తర్వత ఆశు బిగ్ బాస్ హౌస్ లో ఆడిన గేమ్ గురించి మాట్లాడుతు..నీ గేమ్ చూస్తే వరస్ట్‌ హౌజ్‌మేట్‌, వరస్ట్‌ సంచాలక్‌, వరస్ట్ కెప్టెన్, వరస్ట్ బిహెవీయర్‌ అన్ని కంప్లీట్ వరస్ట్ నీకే వచ్చింది’ అంటాడు. దీంతో ఆశు మాట్లాడుతు మనకన్నా పెద్ద ఎదవలు కూడ ఉన్నారు అంటుంది.

ఆశు హౌజ్ లో ఒకరిని నామినేట్ చేయటానికి భయపడింది. ఎందుకంటే వాళ్ళని నామినేట్ చేస్తే మన పాయింట్స్ ఎక్కువ తీస్తారని భయపడ్డావ అని రవి అడుగుతాడు. అప్పుడు ఆశు మాట్లాడుతు వేరొకరికి భయపడటం జీరో అని అంటుంది. తర్వత రవి మాట్లాడుతూ ..మీరు ఓకె అంటే ఒక సంఘటన గురించి మాట్లాడుకుందామా అని అడగగా.. ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఆశు అంటుంది. మీకు నాకు అవసరం లేకపోయినా హౌస్ లో జరిగింది కాబట్టి మాట్లాడాలి అని రవి అనటంతో సీరియస్ అయిన ఆశు మధ్యలో అక్కడి నుండి లేచి వెళ్లి పోతుంది. ఇంకా ఈ ఎపిసోడ్ లో రవి అడిగిన ప్రశ్నలకు ఆశు రెడ్డి ఎలా స్పందించిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.