Anchor Ravi-Shannu: మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్-5 ఎంతోమందిని సెలబ్రిటీలు గా చేసింది. ఈ షో ద్వారా షన్నూ కూడా బాగా పాపులర్ ఇపోయాడు. యూట్యూబ్ ఛానల్ లో వెబ్ సిరీస్ చేస్తూ యూట్యూబ్ ర్ గా కొంత మందికి తెలిసినప్పటికీ బిగ్ బాస్ వల్ల షణ్నూ ఇమేజ్ బాగా పాపులర్ అయింది. ఈ బిగ్ బాస్ వల్ల షణ్నూ-దీప్తి మద్య మనస్పర్థల వచ్చాయని, అందువల్లే దీప్తి షన్నూ కి బ్రేకప్ చెప్పిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల మా టీవీ బిగ్ బాస్ కంటెస్టెంట్లతో వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి రవి హోస్ట్ గా వ్యవహిస్తున్నాడు. ఐతే ఈ ఈవెంట్ లో షణ్ముఖ్ చేసిన పర్ఫార్మెన్స్ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఈవెంట్ లో షణ్ముఖ మై లవ్ ఇస్ గాన్ అంటూ సాగే ఆర్య2 సినిమాలోని పాటకు చాలా ఎమోషన్ తో కూడిన స్టెప్పులు వేసాడు. ఈ కార్యక్రమంలో షణ్ముక్ పర్ఫార్మెన్స్ గురించి రవి మాట్లాడుతూ అడ్డంగా షణ్ముఖ నీ ఇరికించాడు.
బిబి జోడీ అను షోలో షణ్ముక్ పర్ఫార్మెన్స్ గురించి రవి మాట్లాడుతూ.. మై లవ్ ఈస్ గాన్ అన్నావ్.. నీకు అసలు ప్రేమంటే నమ్మకం ఉందా? అని ప్రశ్నించాడు. లవ్ అనే ఎమోషన్ లో సార్రీ, థాంక్స్, బై అని చెప్పాల్సిన పరిస్తితి వచ్చినప్పుడు ఎవరికీ చెప్తావు అని స్టేజ్ మీద అడిగి అందరి ముందు షణ్ముక్ నీ బాగా ఇరికించారు. ప్రస్తుతం ఈ బిబి జోడీ షో కి సంబంధించిన మీడియా ఒకటి అయ్యింది. ఈ షో లో రవి అడిగిన ప్రశ్నకు షణ్ముక్ ఎటువంటి సమాధానం చెప్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.