అయినా కానీ, బుల్లితెర స్పెషల్ ఈవెంట్లలో ప్రదీప్ యాంకరింగ్ వుండాల్సిందే. అలా హోలీ సందర్భంగా ఓ ఛానెల్ వాళ్లు నిర్వహించిన స్పెషల్ షోలో ప్రదీప్ మరీ ఓవరాక్షన్ చేసేశాడంటూ నెట్టింట్ ట్రోలింగ్ జరుగుతోంది. సెల్రబిటీల ఎపైర్లంటే ఒకింత ఆసక్తి వుండడం సహజమే.
అయితే, ఈ ఎఫైర్లే ఇప్పుడు వైరల్ న్యూస్‌గా మారిపోయాయ్. విషయం వున్నా లేకున్నా అఫైర్లు అంటగట్టడం నెట్టింట్లో వైరల్ చేయడం.. ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి, కొందరు ఆర్టిస్టులు, లేదా సెలబ్రిటీలు ఆ ఎఫైర్లను ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారనుకోండి అది వేరే సంగతి.
ఇక్కడ ప్రదీప్ చేసిన ఓవరాక్షన్ ఏంటంటే, ఓ సీరియల్ ఆర్టిస్టుల మధ్య కావాలని బలవంతంగా ఎఫైర్‌ని ఇరికించే ప్రయత్నం చేశాడు. పాపం ఆ ఆర్టిస్టులేమో.. నువ్వెంత లాగినా, మేం బయటపడమ్, నీకు కంటెంట్ ఇవ్వమ్.. అంటూ చాలా గట్టిగానే నిలబడ్డారు. అఫ్‌కోర్స్.! ఇదంతా షో ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగమే అనుకోండి. కానీ, పాపం మన ప్రదీప్ రాజు మాత్రం అడ్డంగా బుక్కయిపోయాడుగా.