Hyper Aadi: ప్రముఖ యాంకర్ చేతిలో తన్నులు తిన్న హైపర్ ఆది.. కారణం ఏంటో తెలుసా?

Hyper Aadi: ప్రముఖ కామెడియన్, నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఆదికి ఈటీవిలో ప్రసారమవుతున్న జబర్ధస్త్ షో లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ షోలో మొదటగా అదిరే అభి టీమ్ లో కంటెస్టెంట్ గా చేసిన ఆది అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో టీం లీడర్ గా ఎదిగాడు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైపర్ ఆది అంటే తెలియని వారంటూ ఉండరు. హైపర్ ఆది జబర్ధస్త్ లో స్కిట్ లు చేయటం వల్ల జబర్ధస్త్ రూపురేఖలే మారిపోయాయి. ఆది వచ్చిన తర్వత జబర్ధస్త్ రేటింగ్స్ పెరిగాయని చెప్పటంలో సందేహం లేదు.

జబర్దస్త్ వల్ల అంత పాపులర్ అయిన ఆది బుల్లితెర మీద పలు టీవీ షోలో మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా రెండు, మూడు సినిమాలలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీ షో లో ఆది చేసే సందడి అంతా ఇంతా కాదు. గత కొంతకాలంగా జబర్దస్త్ లో కనిపించకుండా ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోస్ లో మాత్రమే సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ వారం ప్రసారమైన ఢీ షో లో కూడా ఆది సందడి చేశాడు.

ఆది ఢీ షో లో ఒక టీమ్ కి మెంటర్‌గా చేస్తున్నాడు. ఈ షో లో భాగంగా స్కిట్ చేసే క్రమంలో సీరియల్ హీరో రవి కృష్ణ తో కలిసి కాలేజ్ కుర్రాడిలా నటించాడు. ఈ షోలో లేడీ మెంటర్స్ కూడా ఈ స్కిట్ లో నటించారు. స్కిట్ లో భాగంగా ఆది అమ్మాయిలను రాగింగ్ చేసే క్రమంలో తన పంచ్ లతో అందరినీ నవ్వించాడు. ఆ సమయంలో యాంకర్ ప్రదీప్ వెనకనుండి వచ్చి ఫన్నీగా ఆది తలపై కొట్టాడు. తర్వత గట్టిగా తగిలిందా అన్నా అంటూ ఆది పరువు తీశాడు. దీంతో ఆదికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ప్రదీప్ చేసిన పనికి ఆది అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.