Anasuya: యాంకర్ అనసూయ స్టార్లకు కలిసొస్తుందా.. ఇందులో నిజమెంత?

Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి మనందరికీ తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో తన యాంకరింగ్ ద్వారా ప్రేక్షకులను అలరించిన అనసూయ. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూనే, మరొకవైపు వెండితెరపై సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే అనసూయ స్టార్లకు కలిసొస్తుందా అంటే? అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో అనసూయ కు మంచి గుర్తింపు దక్కింది. అదేవిధంగా ఈ సినిమా చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఇటీవలే విడుదల అయిన పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అనసూయ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందనే నమ్మకానికి వస్తున్నారు మూవీ మేకర్స్. ప్రస్తుతం స్టార్లకు అనసూయ లక్కీ ఛాంప్ గా నిలుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం అనసూయ రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఖిలాడీ సినిమాలో అనసూయ లుక్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో అనసూయ చంద్రకళ అనే పాత్రలో కనిపించబోతోంది అని తెలుస్తోంది. ఇక మేకప్ రిలీజ్ చేసిన లుక్ లో అనసూయ చీరకట్టులో పద్ధతిగా చిరునవ్వులు నవ్వుతూ కనిపించింది. అనసూయ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించనుంది అని సమాచారం. అయితే రంగమ్మత్త గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, ఆ తర్వాత దాక్షాయిని పాత్రలో నటించి మెప్పించింది. మరి చంద్రకళ పాత్రలో అనసూయ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.