స్కిన్ షో తో రెచ్చిపోయిన అనసూయ.. హీటెక్కించే స్టెప్పులతో బుల్లితెరపై రచ్చ..!

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ గత తొమ్మిది ఏళ్లుగా ఆ షోలో యాంకర్ గా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా ఇతర చానల్స్ లో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో కూడా సందడి చేస్తున్న అనసూయ బుల్లితెర మీద తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా టీవీ షోస్ కోసం ఈ అమ్మడు పొట్టి దుస్తులలో హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నేటిజన్స్ కి హీటెక్కిస్తోంది.

ఇలా గ్లామరస్ యాంకర్ గా బాగా గుర్తింపు పొందిన అనసూయ వెండితెర మీద కూడా తన సత్తా చాటుతోంది. బుల్లితెర మీద గ్లామర్ షోతో రెచ్చిపోయే అనసూయ వెండి తెరమీద మాత్రం వైవిధ్యమైన, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో అనసూయ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదివరకే విడుదలైన రంగస్థలం సినిమాలో కూడా రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ రంగమ్మత్తగా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం అనసూయ ఒకవైపు టీవీ షోలు, మరొకవైపు సినిమాలతో చాలా బిజీగా ఉంది.

తన నటనతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్న అనసూయ ఇప్పుడు అరడజను పైగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ప్రస్తుతం అనసూయ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల ఒక బుల్లితెర టీవి షో కోసం ట్రెండీ దుస్తుల్లో అనసూయ అదిరిపోయే డాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఈ క్రమంలో అనసూయ తన నడుము అందాలతో కుర్రకారుని రెచ్చగొట్టింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని సందర్భాలలో వేసుకునే బట్టల వల్ల ఆమె విమర్శలు కూడా ఎదుర్కొంది.అయితే అనసూయ ఇలాంటి విమర్శలను తనదైన శైలిలో కొట్టి పారేస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు.