బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన అనసూయ.. తన ప్రశ్నలతో కంటెస్టెంట్లకు ముచ్చెమటలు…!

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ప్రస్తుతం చాలా రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం 11వ వారంలో కొనసాగుతున్న ఈ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకు చేరువలో ఉంది. ఇప్పటికే ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ ఆటకు మరింత ఊపు అందించేలా బుల్లితెర యాంకర్ అనసూయ రంగంలోకి దిగింది. ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన వీడియో రిలీజ్ అయింది. బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన అనసూయ ఇంటి సభ్యులతో కలిసి అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసి ఎంతో సందడి చేసింది.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు ప్రశ్నలు వేసి వారికి చెమటలు పట్టేలా చేసింది. ఈ సందర్భంగా అఖిల్ ని ప్రశ్నిస్తూ.. లాస్ట్ వీక్ పీచ్ రూమ్ లో కూర్చొని బిందూ మాధవి గురించి నెగటివ్ గా మాట్లాడిన మీరు ఫ్యామిలీ వీక్ లో సడెన్ గా బిందూతో మంచిగ ఉండటానికి ప్రయత్నం చేశారు. ఇలా సడెన్ గా మీ బిహేవియర్ లో మార్పు ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించింది. ఇక అరియానా విషయానికి వస్తే ఫ్యామిలీ వీక్ లో బిందూ తో చాల క్లోజ్ గా ఉన్న మీరు ఇలా సడెన్ గా ఈ ఉమెన్ కార్డ్ ఎందుకు ఆని అడగగా.. మీరూ ఉమెన్ కార్డ్ అంటున్నారు కాబట్టి అది మీకే వదిలేస్తున్నా అంటూ ఆరియాన సమధానం చెప్పింది.

అనసూయ బిగ్ బాస్ హౌజ్ లోకి రాగానే నటరాజ మాష్టర్ తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. మాష్టర్ డాన్స్ చుసి ఇంప్రెస్స్ అయిన అనసూయ నాటంజలి మీ పర్ఫార్మెన్స్ నాటు అంటూ కామెంట్స్ చెసింది. ఇక అనసూయ బిందూ మాధవిని కూడ తన ప్రశ్నలతో ఉక్కిరబిక్కిరీ చేసింది. బిందూని ప్రశ్నిస్తూ నువు ఎప్పుడూ గ్రూప్ గేమ్ ఆడుతూ.. అదే అఖిల్ గ్రూప్ గేమ్ ఆడినప్పుడు ఎందుకూ తప్పు పట్టారు అని అడుగుతుంది. అందుకు బిందూ మాట్లాడుతూ నేనెప్పుడూ గ్రూప్ గేమ్ ఆడలేదు అని సమాధానం చెప్పింది.

ఆ సమయంలో అఖిల్ మాట్లాడుతూ ఒక్కసారి అడిగా కూడా అది గ్రూప్ గేమ్ అవుతుంది అని అంటాడు. బిందు నేనెప్పుడు గ్రూప్ గేమ్ ఆడలేదన్న విషయానికి ఆడియన్స్ మీరు మీకు తెలుసు అని అఖిల్ అంటాడు. శివ గురించి అనసూయ మాట్లాడుతూ మీరు ప్రశ్నలు అడిగే దగ్గర నుంచి అడిగించుకునే వరకు వచ్చారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అంటుంది. ఇక మిత్రతో మాట్లాడుతూ నామినేషన్స్ జరిగే రోజు స్క్రీన్ మీద కనిపించకుండా హౌజ్ లో లాంగ్ టైం ఉండటం గురించి మీరూ ఏం అనుకుంటున్నారు అని ప్రశ్నించింది.