Anchor Anasuya: మరో మెగా ఆఫర్ దక్కించుకున్న యాంకర్ అనసూయ… ఏ సినిమాలో అంటే?

Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ అనసూయ దూకుడు మాములుగా లేదు.ఈమె జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత వరుస సినిమాలతో వెండితెరపై కూడా తన హవా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ మెగా హీరో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాతో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న అనసూయ తాజాగా మరో మెగా హీరో అల్లు అర్జున్ సినిమాలో దాక్షాయని పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ విధంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో మెగా ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం.ఇప్పటికే రామ్ చరణ్ అల్లుఅర్జున్ వంటి హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన అనసూయ తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోన్న భోళా శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్రలో నటించనుందని ఈమె పాత్ర కథను మొత్తం మలుపు తిప్పబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి అనసూయతో చర్చలు పూర్తయ్యాయని త్వరలోనే ఈ యాంకరమ్మ భోళా శంకర్ సినిమా సెట్ లో అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది.ఏది ఏమైనా అనసూయ ఒకవైపు బుల్లితెరపై మరోవైపు వెండితెర పై వరుస సినిమాలలో నటిస్తూ రోజు రోజుకు తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నారు.