Anasuya : వెబ్ మీడియాలోనే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా సెలబ్రిటీల విషయంలో హాటు హాటు కామెంట్లు పడుతున్నాయ్.. వార్తలు, గాసిప్స్ రూపంలో. ‘అందాల ఆరబోత’ అన్న మాట సర్వసాధారణమైపోయింది. అంతకు మించి ఘాటుగా హీరోయిన్ల గురించి ప్రస్తావనను మీడియాలో చూస్తున్నాం.
హీరోయిన్ల వయసు గురించీ, వయసు మీద పడ్డాసరే మొహమాటపడకుండా హీరోయిన్లు చేసే అందాల ప్రదర్శన గురించీ కథనాలు రావడం కొత్తేమీ కాదు. అలాంటి చాలా కథనాలు అనసూయ మీద కూడా వచ్చాయ్. తాజాగా అనసూయ మీద అలాంటి ఓ కథనం ఓ వెబ్ మీడియాలో వస్తే, అనసూయ గుస్సా అయ్యింది. ‘డిగ్నిటీ’ ప్రస్తావన తెస్తూ సోషల్ మీడియాలో క్లాస్ తీసుకుంది.
అరరె, అనసూయ కూడా డిగ్నిటీ, డీసెన్సీ గురించి మాట్లాడుతోందే.. అంటూ చాలామంది ఆశ్చర్యపోతూ స్పందించారు. వాళ్ళకి మళ్ళీ కౌంటర్ల వేస్తూ వెళ్ళింది అనసూయ. అనసూయ నటి కాబట్టి, సినిమా కోసమో, టీవీల్లో అందంగా కనిపించడం కోసమో గ్లామరస్ అవతార్ తప్పకపోవచ్చు.
కానీ, కామెడీ పేరుతో అత్యంత జుగుప్సాకరంగా అనసూయ మీద కామెంట్లు పడుతున్నప్పుడు, అలాంటి కామెంట్లేస్తున్న కమెడియన్లపై అనసూయ ఎందుకు సీరియస్ అవదు.? అది ప్రొఫెషన్.. అని సరిపెట్టుకుంటుంది అనసూయ.
అయినా, ఆమెకు నచ్చితే ఎలాగైనా వుండొచ్చు.? ప్రశ్నించడానికి మీరెవరు.? అంటూ అనసూయ అభిమానులు సెటైరికల్‌గా ఆమె మీదనే పంచులేస్తూ.. వార్తా కథనాల్ని ప్రస్తావిస్తుండడం గమనార్హం.