మరో కొత్త కార్యక్రమంలో అందాల ఆరబోతతో రెచ్చిపోయిన అనసూయ..!

యాంకర్ అనసూయ ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు.ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానం కొనసాగిస్తూనే వెండితెరపై కూడా అద్భుతమైన అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు.ఇన్ని రోజుల వరకు కేవలం యాంకర్గా ఈటీవీకి మాత్రమే పరిమితమైన అనసూయ మెల్లమెల్లగా ఈటీవీకి దూరం అవుతూ స్టార్ మాకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈమె సుధీర్ తో కలిసి సూపర్ సింగర్ జూనియర్స్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమం మాత్రమే కాకుండా స్టార్ మాలో మరో కొత్త షోకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ది నెక్స్ట్ సూపర్ స్టార్ అంటూ సరికొత్త కార్యక్రమం ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ యధావిధిగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ అభిమానులకు సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇలా అనసూయ రోజురోజుకు ఈ టీవీకి దూరమవుతూ స్టార్ మాకు దగ్గరగా పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇలా బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న అనసూయ వెండితెరపై కూడా వరుస సినిమా అవకాశాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె సుమారు ఐదారు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒక వైపు వెండితెరపై మరోవైపు బుల్లితెరపై వరుస అవకాశాలతో ఈ రంగమ్మత్త కెరీర్లో ఎంతో బిజీ అయ్యారు.