అనసూయ అసహనం: కోట మరీ అంత ‘తప్పు’ మాట్లాడేశారా.?

Anasuya Shocking Reply Viral And So Many With Her 1 | Telugu Rajyam

‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయ భరద్వాజ్‌కి కోసమొచ్చేసింది సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మీద. ‘అనసూయ చాలా అందంగా వుంటుంది.. మంచి నటి కూడా. కానీ, ఆ డ్రస్సులే కొంచెం… బాగా లేవని నా అభిప్రాయం..’ అంటూ జబర్దస్త్ కామెడీ షో గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

అంతే, అనసూయకి స్టఫ్ దొరికేసింది. కోట మీద వరుస ట్వీట్లతో విరుచుకుపడిపోయింది. ఏదో పాపం పెద్దాయన.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.. అనుకోకుండా, ఎడా పెడా ఎదురుదాడికి దిగింది. పెళ్ళయిన హీరోలు చొక్కాలు విప్పేసి సిక్స్ ప్యాక్ చూపిస్తున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పరు.? అయినా, వేసుకునే దుస్తుల గురించి విమర్శలు చేయడానికి మీరెవరు.? అంటూ కోట మీద మండిపడింది అనసూయ.

నిజమే, ఈ రోజుల్లో అమ్మాయిలు, మహిళల డ్రెస్సింగ్ గురించి కామెంట్లు చేస్తే ఇలాగే చీవాట్లు తినాల్సి వస్తుంది. ఎందుకంటే, ట్రెండ్ మారింది. ‘మేం ఎలాంటి దుస్తులైనా ధరిస్తాం.. చూసి ఎంజాయ్ చెయ్యాలే తప్ప, కామెంట్లు చేయకూడదు..’ అనే స్థాయిలో విరుచుకుపడిపోతున్నారు అనసూయ లాంటోళ్ళు.

కోట శ్రీనివాసరావుకి ఈ విషయమై ఎందుకలా కామెంట్ చేయాల్సి వచ్చిందో ఏమోగానీ, లేటు వయసులో ఈ ఘాటు వివాదాలు ఆయనకి అవసరమా.? ‘మా’ ఎన్నికల నేపథ్యంలోనూ, అంతకు ముందూ కోట పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తల్లోకెక్కారు. ఆయన వ్యాఖ్యలకి అటువైపు నుంచి కౌంటర్ ఎటాక్ వస్తే, ‘పాపం పెద్దాయన..’ అనే సింపతీ ఆయన మీదకే వస్తోంది.

అలాగని, ప్రతిసారీ వివాదాల్లోకెక్కుతానంటే ఎలా.? అన్నట్టు, యూ ట్యూబ్ ఛానళ్ళ పుణ్యమా అని.. ఇలాంటి వివాదాలు ఇంకా ఇంకా ఎక్కువైపోతున్నాయ్. అన్నట్టు, తన వస్త్రధారణ విషయమై తానే తన కుమారుడి వద్ద ఒకింత చిన్నబోయే పరిస్థితి వచ్చిందని గతంలో ఓ సారి చెప్పుకున్న అనసూయ, ఇప్పుడు అదే డ్రెస్సింగ్ మీద సీనియర్ నటుడు వ్యాఖ్యానిస్తే ఎందుకింతలా గుస్సా అయ్యిందో.?

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles